Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

పెట్రోలింగ్ పోలీస్ వాహనాన్ని ఢీకొన్న లారీ.. ఎస్సై, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పెట్రోలింగ్ పోలీస్ వాహనాన్ని ఢీకొన్న లారీ.. ఎస్సై, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఖమ్మం: తిరుమలాయపాలెం మండలంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ వాహనాన్ని చేపల లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీశ్, పోలీస్ వాహన డ్రైవర్ కొత్తపల్లి రాకేష్ తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చేపల లోడుతో వెళ్తున్న AP-16-TH-6179 నంబర్ లారీ తిరుమలాయపాలెం శివారులోని భవానీ హోటల్ సమీపంలో పోలీస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఎస్సై జగదీశ్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉండగా, రాకేష్‌ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పెట్రోలింగ్ పోలీస్ వాహనాన్ని ఢీకొన్న లారీ.. ఎస్సై, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *