Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

ఎలమంచిలిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ.. కొత్త పెన్షన్లపై ప్రగడ హామీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎలమంచిలిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ.. కొత్త పెన్షన్లపై ప్రగడ హామీ

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) ఎలమంచిలి: ఎలమంచిలి పట్టణ పరిధిలోని తులసినగర్, ఎన్టీఆర్ కాలనీల్లో 7, 8, 9 వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు.
  • ఏపీఆర్‌డీసీ చైర్మన్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందజేశారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో )

ఎలమంచిలి: ఎలమంచిలి పట్టణ పరిధిలోని తులసినగర్, ఎన్టీఆర్ కాలనీల్లో 7, 8, 9 వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఏపీఆర్‌డీసీ చైర్మన్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అర్హులైన వారికి త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల స్కూల్ గర్ల్స్ హైస్కూల్ కమిటీ ఎన్నికల్లో చైర్మన్‌గా ఎన్నికైన పల్ల లలితను అభినందించారు. స్థానికులు తెలిపిన మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆడారి ఆదిమూర్తి, కొటారు సాంబ, దాడి రమేష్, ఆడారి రమణబాబు, బొద్దపు శ్రీనివాసరావు, ఆడారి సన్యాసినాయుడు, దాంట్ల వెంకటస్వామి, నమ్మి రమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *