Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

అంబేద్కర్ సర్కిల్‌లో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అంబేద్కర్ సర్కిల్‌లో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

వార్త ముఖ్యాంశాలు

  • చిట్వేలి: మండల కేంద్రమైన చిట్వేలి అంబేద్కర్ సర్కిల్ పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.
  • డీటీఆర్‌ కింద కేబుల్‌ మార్పిడి పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
  • కేబుల్‌ మార్పిడి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.

చిట్వేలి: మండల కేంద్రమైన చిట్వేలి అంబేద్కర్ సర్కిల్ పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. డీటీఆర్‌ కింద కేబుల్‌ మార్పిడి పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. కేబుల్‌ మార్పిడి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. అంబేద్కర్ సర్కిల్ పరిధిలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి, విద్యుత్‌ అవసరాలకు అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. పనులు పూర్తయిన అనంతరం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. విద్యుత్ శాఖ సిబ్బందికి ప్రజలు సహకరించాలని చిట్వేలి విద్యుత్ శాఖ ఏఈ బాలకృష్ణ కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *