Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్‌పై బుర్రకథ రూపంలో అవగాహన కార్యక్రమంను పర్యవేక్షించిన దిశా క్లస్టర్ ప్రోగ్రాము మేనేజర్ పి బాలాజీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్‌పై బుర్రకథ రూపంలో అవగాహన కార్యక్రమంను పర్యవేక్షించిన దిశా క్లస్టర్ ప్రోగ్రాము మేనేజర్ పి బాలాజీ

వార్త ముఖ్యాంశాలు

  • డాక్టర్ బి.ఆర్.
  • అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని వేపచెట్టు వీధిలో ఉన్న గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ ఎస్ శాంతి రాజశ్రీ ఆధ్వర్యంలో విద్యార్థులకు హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
  • ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం సూచనలతో దిశా,జనకళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ ప్రివెన్షన్ యూనిట్ సహకారంతో ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్‌లో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని మరియు సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని వేపచెట్టు వీధిలో ఉన్న గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ ఎస్ శాంతి రాజశ్రీ ఆధ్వర్యంలో విద్యార్థులకు హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం సూచనలతో దిశా,జనకళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ ప్రివెన్షన్ యూనిట్ సహకారంతో ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్‌లో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని మరియు సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా దిశా క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ పి బాలాజీ విద్యార్థులకు హెచ్‌ఐవీ ఎలా సంక్రమిస్తుంది, ఎలా సంక్రమించదు, హెచ్‌ఐవీ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పై గల ఆపోహాలు, హెచ్‌ఐవీ సోకిన వారికి అందుబాటులో ఉన్న చికిత్సా సేవలపై అవగాహన కల్పించారు. అలాగే సుఖవ్యాధులు, క్షయ వ్యాధి, డ్రగ్స్ వినియోగం, హెచ్‌ఐవీ బాధితుల పట్ల వివక్ష చూపకూడదనే అంశాలను వివరించారు.అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్‌కు సంబంధించిన పలు ఉచిత సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 1097 టోల్‌ఫ్రీ నంబర్, హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్ చట్టం 2017, ఏఆర్‌టీ మందుల కేంద్రాలు తదితర అంశాలపై విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ప్రేమానందం కళాజాత బుర్రకదా రూపంలో కళాశాలలో మరియు బస్టాండ్ ప్రాంతంలోనూ విద్యార్థులకు,ప్రజలకు హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. జనకళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ టి ఐ సిబ్బంది కరపత్రాలను పంపిణీ చేసి, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయించడం ద్వారా సెల్ఫ్ రిస్క్ అసెస్‌మెంట్ ఫారంను పూర్తి చేయించారు.ఈ కార్యక్రమంలో దిశా,జనకళ్యాణ్ ప్రాజెక్ట్ సిబ్బంది, ఏఎన్‌ఎం కె. వెంకటరమణ, ఔట్రీచ్ స్టాఫ్ ఏం వి. జ్యోతి, కే. శ్రీనివాస్ పీర్ ఎడ్యుకేటర్ గుర్రాల అమల, రామసత్యనారాయణ ఏం. శ్యామల, కౌన్సిలర్, గవర్నమెంట్ జూనియర్ కళాశాల అధ్యాపకులు,ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *