వార్త ముఖ్యాంశాలు
- *స్థానిక ఎన్నికలకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్ కృతిక శుక్ల,**శాంతియుతంగా ఎన్నికల నిర్వహణ:ఎస్పీ జగదీష్ వెల్లడి**తొలి విడతలో 7 మున్సిపాలిటీలు, 28 జెడ్పీటీసీ, 419 ఎంపీటీసీ, 507 పంచాయతీలకు ఎన్నికలు.**సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక బలగాల మోహరింపు..
- రౌడీ షీటర్ల బైండోవర్.*నరసరావుపేట, అక్టోబర్ 15పల్నాడు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం, పోలీసు శాఖ సర్వసన్నద్ధమయ్యాయి.
- నరసరావుపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల, జిల్లా ఎస్పీ కె.
*స్థానిక ఎన్నికలకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్ కృతిక శుక్ల,**శాంతియుతంగా ఎన్నికల నిర్వహణ:ఎస్పీ జగదీష్ వెల్లడి**తొలి విడతలో 7 మున్సిపాలిటీలు, 28 జెడ్పీటీసీ, 419 ఎంపీటీసీ, 507 పంచాయతీలకు ఎన్నికలు.**సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక బలగాల మోహరింపు.. రౌడీ షీటర్ల బైండోవర్.*నరసరావుపేట, అక్టోబర్ 15పల్నాడు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం, పోలీసు శాఖ సర్వసన్నద్ధమయ్యాయి. నరసరావుపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల, జిల్లా ఎస్పీ కె. జగదీష్ అదహళ్లి ఎన్నికల కార్యాచరణ, భద్రతా ప్రణాళికలను వెల్లడించారు. తొలి విడతలో భాగంగా జిల్లాలోని పిడుగురాళ్ల, సత్తెనపల్లి, చిలకలూరిపేట, వినుకొండ, దాచేపల్లి, గురజాల,మాచర్ల మున్సిపాలిటీల్లోని 247 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయని కలెక్టర్ తెలిపారు. మొత్తం 3,38,294 మంది ఓటర్ల కోసం 465 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని, వీటిలో 188 హైపర్ సెన్సిటివ్, 155 సెన్సిటివ్ కేంద్రాలుగా గుర్తించామని వివరించారు.
ఈ మున్సిపాలిటీల్లో 16 నుంచి 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. కోర్టు కేసులు, డీలిమిటేషన్ ప్రక్రియ కారణంగా నరసరావుపేట మున్సిపాలిటీకి నవంబర్ 15 తర్వాత రెండో విడతలో ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు.గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించి రిజర్వేషన్ల గెజిట్ పూర్తయిందని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లాలోని 28 జెడ్పీటీసీ, 419 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అమరావతి మండలం పరిధిలోని 13 ఎంపీటీసీ స్థానాలకు సీఆర్డీఏ విలీన ప్రతిపాదనల కారణంగా తాత్కాలికంగా ఎన్నికలు నిలిపివేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీల కోసం 1,548 పోలింగ్ కేంద్రాలు (706 హైపర్ సెన్సిటివ్, 488 సెన్సిటివ్) ఏర్పాటు చేశారు. జిల్లాలోని 507 గ్రామ పంచాయతీల్లోని 5,216 వార్డులకు గాను 5,270 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు.
వీటిలో 183 పంచాయతీలను హైపర్ సెన్సిటివ్, 150 పంచాయతీలను సెన్సిటివ్ జాబితాలో చేర్చారు. సీఆర్డీఏ విలీన ప్రతిపాదనలతో అమరావతిలో 15, పెదకూరపాడులో 3 గ్రామాలు, నరసరావుపేట మున్సిపాలిటీ విలీన పరిధిలోని 5 గ్రామాలను ఈ విడత నుంచి మినహాయించినట్లు కలెక్టర్ వెల్లడించారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కోసం ప్రతి మున్సిపాలిటీ, మండల స్థాయిలో స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఎంసీసీ టీమ్లను నియమించి, వారికి మెజిస్టీరియల్ అధికారాలు అప్పగించారు. సరిహద్దుల్లో చెక్పోస్టుల ద్వారా 24 గంటల పాటు తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు.
జిల్లా ఎస్పీ కె.జగదీష్ అదహళ్లి మాట్లాడుతూ ఎన్నికల వేళ శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా విస్తృత రక్షణ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా రౌడీ షీటర్లు, అనుమానితులను బైండోవర్ చేయడంతో పాటు వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నామని, పెండింగ్లో ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్లను అమలు చేస్తున్నామని వివరించారు.
సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిరంతర నిఘా ఉంచి అదనపు పోలీస్ బలగాలను మోహరిస్తున్నట్లు పేర్కొన్నారు. నామినేషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లు, రిసెప్షన్ మరియు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత కల్పించినట్లు తెలిపారు.
ఎన్నికలు సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు, ప్రజలు సంపూర్ణంగా సహకరించాలని కలెక్టర్, ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
