Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

సూళ్లూరుపేటలో నో పార్కింగ్ బైకులపై పోలీసుల కొరడా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సూళ్లూరుపేటలో నో పార్కింగ్ బైకులపై పోలీసుల కొరడా

వార్త ముఖ్యాంశాలు

  • ⛔20 ద్విచక్ర వాహనాలకు జరిమానా..
  • ⛔ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు:: సీఐ మురళీకృష్ణ పున్నమి న్యూస్ సూళ్లూరుపేట 📌సూళ్లూరుపేట పట్టణంలోని ప్రధాన కూడళ్ళలో నో పార్కింగ్ ప్రాంతాల్లో ఇష్టారీతిగా బైకులు నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న వాహనదారులపై పోలీసులు చర్యలు చేపట్టారు.
  • ప్రధానంగా కోమల హోటల్, ఆహా టిఫిన్ సెంటర్‌ ముందు రోడ్డుపై బైకులు అడ్డంగా పార్కింగ్ చేయడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నట్లు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి.

⛔20 ద్విచక్ర వాహనాలకు జరిమానా..

⛔ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు:: సీఐ మురళీకృష్ణ

పున్నమి న్యూస్ సూళ్లూరుపేట

📌సూళ్లూరుపేట పట్టణంలోని ప్రధాన కూడళ్ళలో నో పార్కింగ్ ప్రాంతాల్లో ఇష్టారీతిగా బైకులు నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న వాహనదారులపై పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రధానంగా కోమల హోటల్, ఆహా టిఫిన్ సెంటర్‌ ముందు రోడ్డుపై బైకులు అడ్డంగా పార్కింగ్ చేయడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నట్లు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి.

📌సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నో పార్కింగ్ ప్రాంతంలో నిలిపి ఉంచిన సుమారు 15 నుంచి 20 ద్విచక్ర వాహనాలను గుర్తించి జరిమానాలు విధించారు. ఒక్కో వాహనానికి సుమారు రూ.1,000 వరకు జరిమానా విధించినట్లు సమాచారం.

📌హోటళ్లకు వచ్చే కొందరు వాహనదారులు రోడ్డుపైనే బైకులు నిలిపివేయడంతో ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా అత్యవసర సమయంలో అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు, ఆర్టీసీ బస్సులు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందని పేర్కొన్నారు.

📌ఇకపై నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపే వారిపై నిరంతరం తనిఖీలు నిర్వహించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, తమ వాహనాలను నిర్ణీత పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలపాలని సూచించారు.

📌అదేవిధంగా హోటల్, టిఫిన్ సెంటర్ యజమానులు తమ వద్దకు వచ్చే కస్టమర్లకు పార్కింగ్‌పై అవగాహన కల్పించాలని, రోడ్డుపై వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.

📌ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు చేపట్టిన ఆకస్మిక తనిఖీలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *