Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

సీఎం చంద్రబాబును కలిసిన ప్రగడ నాగేశ్వరరావు.. సమస్యలపై కీలక వినతి!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సీఎం చంద్రబాబును కలిసిన ప్రగడ నాగేశ్వరరావు.. సమస్యలపై కీలక వినతి!

వార్త ముఖ్యాంశాలు

  • దుప్పితూరు సమస్యలు, ఏడుమూర్ల గట్టు, CMRF సాయం..
  • కొయ్య శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉండాలని విజ్ఞప్తి పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో) యలమంచిలి: యలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్, ఏపీ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APRDC) చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు గురువారం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు.
  • నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రాలు అందజేశారు.

దుప్పితూరు సమస్యలు, ఏడుమూర్ల గట్టు, CMRF సాయం.. కొయ్య శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉండాలని విజ్ఞప్తి

పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో)

యలమంచిలి: యలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్, ఏపీ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APRDC) చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు గురువారం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రాలు అందజేశారు. దుప్పితూరు గ్రామాన్ని చుట్టుముట్టిన పరిశ్రమలతో ఏర్పడుతున్న ఇబ్బందులు, పునరావాస కాలనీ, ప్రత్యేక ప్యాకేజీ, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై గ్రామస్తులతో కలిసి వినతిపత్రం సమర్పించారు.
సారదా నది పరివాహక ప్రాంతంలో కీలకమైన ఏడుమూర్ల గట్టు పునర్నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరారు. గట్టు పునర్నిర్మాణంతో సుమారు 4 వేల ఎకరాల సాగుకు, వరదల సమయంలో 10 గ్రామాల్లోని 15 వేల మందికి రక్షణ కలుగుతుందని వివరించారు.
అలాగే నిరుపేద నాయకులు, కార్యకర్తలకు సంబంధించిన రూ.10 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువైన CMRF వైద్య సహాయ ఫైళ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల మృతిచెందిన యువ సర్పంచ్ కొయ్య శ్రీనివాస్ కుటుంబానికి ప్రభుత్వం, పార్టీ తరఫున అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *