Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

సిగరెట్ కాలుస్తూ… 20 నిమిషాల్లో!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సిగరెట్ కాలుస్తూ… 20 నిమిషాల్లో!

వార్త ముఖ్యాంశాలు

  • ఆగస్టు 28 పున్నమి ప్రతినిధి @ నిన్నటిదాకా సరదా సరదాగా సిగరెట్ కాలుస్తూ...రింగులు రింగులుగా పొగ వదులుతూ గడిపిన సుబ్బారావు పొగతాగడం మానేయాలని డిసైడయ్యారు.
  • అయితే ఆయనకో అనుమానం...
  • ఇన్నేళ్లుగా ఉన్న ఈ అలవాటును హఠాత్తుగా మానేస్తే ప్రయోజనం ఉంటుందా?..

ఆగస్టు 28 పున్నమి ప్రతినిధి @
నిన్నటిదాకా సరదా సరదాగా సిగరెట్ కాలుస్తూ…రింగులు రింగులుగా పొగ వదులుతూ గడిపిన సుబ్బారావు పొగతాగడం మానేయాలని డిసైడయ్యారు. అయితే ఆయనకో అనుమానం… ఇన్నేళ్లుగా ఉన్న ఈ అలవాటును హఠాత్తుగా మానేస్తే ప్రయోజనం ఉంటుందా?.. అని.

పొగతాగడం మానేశాక ఏం జరుగుతుందనే దానిపై ప్రపంచ ప్రఖ్యాత పరిశోధనలు ఇలా చెబుతున్నాయి

మానేయడానికి మార్గాలెన్నో…

నోటితో నమిలే తక్కువ మోతాదు ఉన్న ‘నికోటిన్ బబుల్గమ్’ ద్వారా సిగరెట్లు తాగాలనే కోరిక క్రమంగా తగ్గించుకోవచ్చు.

చర్మంపై అతికించే ‘నికోటిన్ ప్యాచెస్’ ప్లాస్టర్తో సిగరెట్ మానేస్తే ఎదురయ్యే తలనొప్పి, చిరాకులను దూరం చేయవచ్చు.

సిగరెట్ అలవాటును దూరం చేసుకోడానికి నాసల్ స్ప్రే రూపంలో మందులున్నాయి.

ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘స్మోకింగ్ డీ అడిక్షన్’ వ్యవస్థ ఉంది. ఇక్కడి వైద్యులు ఉచితంగానే కౌన్సెలింగ్ చేస్తారు.

సిగరెట్లు తాగే అలవాటు తీవ్రంగా ఉన్నవారు వైద్యుని ఆశ్రయిస్తే.. కొన్ని మందులు, ఇంజక్షన్ల రూపంలో డీ అడిక్షన్ ట్రీట్మెంట్ ప్రారంభిస్తారు.

ప్రపంచంలో సుమారు 125 కోట్ల మంది ఏదో ఒక రూపంలో పొగాకు వినియోగిస్తున్నారు. సిగరెట్లకు అధిక సంఖ్యలో బానిసలవుతున్నారు. పురుషుల్లో ఈ అలవాటు ఎక్కువగా ఉంది. పొగ తాగే మహిళల సంఖ్య కూడా పెరుగుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *