వార్త ముఖ్యాంశాలు
- ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా విడుదల చేశారు.
- రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని తెలిపారు.
- అక్టోబర్ 28న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి, 30న ఫలితాలు ప్రకటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని తెలిపారు. అక్టోబర్ 28న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి, 30న ఫలితాలు ప్రకటించనున్నారు. నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 18, పరిశీలనకు 19, ఉపసంహరణకు 21 తేదీలను నిర్ణయించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నవంబర్ 3న నిర్వహించి, 5న ఫలితాలు వెల్లడించనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి. తొలి దశ నవంబర్ 26న, రెండో దశ నవంబర్ 29న, మూడో దశ డిసెంబర్ 2న నిర్వహించనున్నట్లు మీడియా సమావేశంలో వివరించారు.