Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ఈ నెల 20 నుండి శ్రీకాళహస్తిలో వేసవి చెస్ శిక్షణ శిబిరం ప్రారంభం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఈ నెల 20 నుండి శ్రీకాళహస్తిలో వేసవి చెస్ శిక్షణ శిబిరం ప్రారంభం

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి, మే 15 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలో చిల్డ్రన్స్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిల్లల్లో మానసిక నైపుణ్యాలు, ఏకాగ్రత, క్రీడా పటిమ పెంపొందించేందుకు ఈ నెల 20 నుండి వేసవి చెస్ కోచింగ్ శిబిరం నిర్వహించనున్నారు.
  • గత 25 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ శిక్షణ ద్వారా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో శ్రీకాళహస్తి విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.
  • స్థానిక ముత్యాలమ్మ గుడి వీధిలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల ప్రాంగణంలో మే 20 నుంచి 30 వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.

శ్రీకాళహస్తి, మే 15 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలో చిల్డ్రన్స్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిల్లల్లో మానసిక నైపుణ్యాలు, ఏకాగ్రత, క్రీడా పటిమ పెంపొందించేందుకు ఈ నెల 20 నుండి వేసవి చెస్ కోచింగ్ శిబిరం నిర్వహించనున్నారు. గత 25 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ శిక్షణ ద్వారా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో శ్రీకాళహస్తి విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. స్థానిక ముత్యాలమ్మ గుడి వీధిలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల ప్రాంగణంలో మే 20 నుంచి 30 వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఆసక్తి గల విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. పూర్తి వివరాలకు 98480 65445, 98666 67962 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *