వార్త ముఖ్యాంశాలు
- చెన్నరావుపేట :(పున్నమి న్యూస్ ) వైష్ణవి మృతదేహంతో ధర్నాకు యత్నం: అడ్డుకున్న పోలీసులు :మధ్యప్రదేశ్లో లో బీటెక్ విద్యార్థిని వాంకుడోతు వైష్ణవి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
- నర్సంపేట మండలం చంద్రాయపల్లి బుచ్చినాయక్ తండాకు చెందిన వైష్ణవి మృతికి చెన్నారావుపేట మండలం పాపయ్యపేట శివారు అమ్ముతండాకు చెందిన బోడ సుమన్ కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
- ఈ నేపథ్యంలో వైష్ణవి మరణానికి కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో సుమన్ ఇంటి ఎదుట ధర్నా చేసేందుకు బంధువులు బయలుదేరారు.
చెన్నరావుపేట :(పున్నమి న్యూస్ )
వైష్ణవి మృతదేహంతో ధర్నాకు యత్నం: అడ్డుకున్న పోలీసులు
:మధ్యప్రదేశ్లో లో బీటెక్ విద్యార్థిని వాంకుడోతు వైష్ణవి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నర్సంపేట మండలం చంద్రాయపల్లి బుచ్చినాయక్ తండాకు చెందిన వైష్ణవి మృతికి చెన్నారావుపేట మండలం పాపయ్యపేట శివారు అమ్ముతండాకు చెందిన బోడ సుమన్ కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైష్ణవి మరణానికి కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో సుమన్ ఇంటి ఎదుట ధర్నా చేసేందుకు బంధువులు బయలుదేరారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు దీక్షకుంట వద్ద వారిని మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. పోలీసుల చర్యతో ఆగ్రహించిన బంధువులు అక్కడే నిరసనకు దిగడంతో కొంతసేపు తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైష్ణవి ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
వార్తా మూలాలు
- Praveenపత్రికా ప్రకటన