రికార్డుల పరిశీలన.. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సూచనలు
ఖానాపురం, మండలం
వరంగల్ జిల్లా నర్సంపేట ఏసీపీ టి. రాజేందర్ రెడ్డి ఖానాపురం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, స్టేషన్ పరిసరాలను, నిర్వహణ తీరును సమీక్షించారు.
ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, సమస్యలపై తక్షణమే స్పందించాలని ఖానాపురం ఎస్‌హెచ్‌ఓ గుగులోతు రామ్మోహన్‌కు పలు సూచనలు చేశారు.
అనంతరం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏఎస్ఐ, దుగ్గొండి సీఐ జె. జయశంకర్ రావు, పోలీస్ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరారు.
