Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

ఆరోగ్యం ఉంటేనే అన్నీ ఉంటాయి, పేదవాడికి ఆరోగ్యం అందించడమే నిజమైన సేవ” – డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఆరోగ్యం ఉంటేనే అన్నీ ఉంటాయి, పేదవాడికి ఆరోగ్యం అందించడమే నిజమైన సేవ” – డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • చెన్నరావుపేట :(పున్నమి న్యూస్ ) ఆరోగ్యం ఉంటేనే అన్నీ ఉంటాయి, పేదవాడికి ఆరోగ్యం అందించడమే నిజమైన సేవ" - డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి _జనతా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖానాపురంలో ఘనంగా ఉచిత మెగా వైద్య…
  • ఈ కార్యక్రమానికి జనతా ట్రస్ట్ చైర్మన్ డా.
  • గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారు స్వయంగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు.

చెన్నరావుపేట :(పున్నమి న్యూస్ )
ఆరోగ్యం ఉంటేనే అన్నీ ఉంటాయి, పేదవాడికి ఆరోగ్యం అందించడమే నిజమైన సేవ” – డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

_జనతా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖానాపురంలో ఘనంగా ఉచిత మెగా వైద్య శిబిరం మరియు 5వ విడత ఉచిత కంటి వైద్య శిబిరం_

నర్సంపేట నియోజకవర్గం, ఖానాపురం మండలంలోని రెడ్డి పెద్ద రంగారెడ్డి ఫంక్షన్ హాల్ లో ఈరోజు జనతా ట్రస్ట్, బంధన్ హాస్పిటల్స్ మరియు శంకర కంటి ఆసుపత్రి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం మరియు 5వ విడత ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జనతా ట్రస్ట్ చైర్మన్ డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారు స్వయంగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డబ్బు ఉన్నవారికి ఎక్కడైనా వైద్యం దొరుకుతుందని, కానీ పేదవాడి ఇంటి ముందుకే కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా తీసుకురావడమే జనతా ట్రస్ట్ లక్ష్యమని అన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ఇలాంటి శిబిరాలు ప్రతి మండలంలో నిర్వహిస్తామని, ఎవరూ డబ్బు లేక వైద్యానికి దూరం కాకూడదని తెలిపారు.

ఈ శిబిరంలో శంకర కంటి ఆసుపత్రికి చెందిన నిపుణులైన వైద్యులచే దాదాపు _976 మందికి_ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో
వీరిలో 476 మందికి ఉచిత కంటి అద్దాలు పంపిణి చేయడం జరిగింది, అంతే కాకా కంటి శస్త్ర చికిత్స అవసరం ఉన్న 66 మందిని ఉచిత సర్జరీలకు ఎంపిక చేయడం జరిగింది. వారందరికీ హైదరాబాద్ లోని శంకర కంటి ఆసుపత్రిలో పూర్తి ఉచితంగా ఆపరేషన్లు చేసి, మందులు కూడా ఉచితంగా అందజేస్తామని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది.

బంధన్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో Trauma, Emergency & Critical Care తరఫున దాదాపు _12 మంది_ స్పెషలిస్ట్ డాక్టర్లు ఈ శిబిరానికి విచ్చేసి దాదాపు 268 మందికి పైగా రోగులకు సేవలందించారు. జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పల్మనాలజీ, గైనకాలజీ, డెంటల్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, క్రిటికల్ కేర్ విభాగాలలో ఉచితంగా చెకప్ చేసి, అందరికీ బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అంతేకాకుండా బంధన్ హాస్పిటల్ కు వస్తే తమ ద్వారా అయ్యే అన్ని ఆపరేషన్లకు, చికిత్సలకు ప్రత్యేక రాయితీలు, ఆఫర్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జనతా ట్రస్ట్ సభ్యులు, బంధన్, శంకర హాస్పిటల్ వైద్య సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Praveenపత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *