Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

వినాయక చవితి సందర్భంగా అన్న సమారాధన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వినాయక చవితి సందర్భంగా అన్న సమారాధన

వార్త ముఖ్యాంశాలు

  • గాజువాక,(పున్నమి ప్రతినిధి), సెప్టెంబర్ 19:జీవీఎంసీ 87వ వార్డు పరిధిలోని రాజులపాలెం (లక్ష్మీపురం) కాలనీ రాజులపాలెం పార్కులో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా చేకూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సిపీ సీనియర్ నాయకులు, కమిటీ సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరై వినాయకుడిని…
  • అనంతరం అన్న సమారాధనను ప్రారంభించి భక్తులకు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
  • ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చేకూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలను నిర్వహించడంతో పాటు అన్న సమారాధన ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపీ నాయకులు, జిల్లా వైసీపీ సెక్రటరీ ప్రగడ వేణుబాబు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇల్లపురాము, జిల్లా బీసీ సెల్ జనరల్…

గాజువాక,(పున్నమి ప్రతినిధి), సెప్టెంబర్ 19:జీవీఎంసీ 87వ వార్డు పరిధిలోని రాజులపాలెం (లక్ష్మీపురం) కాలనీ రాజులపాలెం పార్కులో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా చేకూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సిపీ సీనియర్ నాయకులు, కమిటీ సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరై వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న సమారాధనను ప్రారంభించి భక్తులకు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చేకూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలను నిర్వహించడంతో పాటు అన్న సమారాధన ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపీ నాయకులు, జిల్లా వైసీపీ సెక్రటరీ ప్రగడ వేణుబాబు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇల్లపురాము, జిల్లా బీసీ సెల్ జనరల్ సెక్రటరీ ముద్దపప్పు దామోదర్, దుగ్గపు దానప్పలు, గుంట్ల శ్రీను, అప్పిని సన్యాసిరావు, ప్రగడ రాము, లక్ష్మీపురం కమిటీ సభ్యులు హరీష్ వర్మ, కళ్లేపల్లి శ్రీనివాస వర్మ, అశోక్ వర్మ, తిలక్ రాజు, చేకూరి ఫౌండేషన్ యూత్ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *