Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

వారసిగూడలో ఘనంగా గణేష్ నవరాత్రి వేడుకలు 101 జ్యోతులతో గోమాతకు మహిళలు ప్రత్యేక పూజలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వారసిగూడలో ఘనంగా గణేష్ నవరాత్రి వేడుకలు 101 జ్యోతులతో గోమాతకు మహిళలు ప్రత్యేక పూజలు

వారసిగూడలో ఘనంగా గణేష్ నవరాత్రి వేడుకలు
101 జ్యోతులతో గోమాతకు మహిళలు ప్రత్యేక పూజలు

వారసిగూడలో గణేష్ నవరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. వారసిగూడ గణేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రి వేడుకల్లో భాగంగా మహిళలు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా 101 జ్యోతులతో గోమాత పూజను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గోమాతను పూజించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని నిర్వాహకులు తెలిపారు. మహిళలు గోమాతకు ప్రత్యేక పూజలు చేసి, జ్యోతులు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో రేవతి, అంబిక, స్వాతి, సుజాత, సౌమ్య, అఖిల, అనుష, అర్చన, భావన, వామిక తదితర మహిళలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సందడితో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.

వారసిగూడలో ఘనంగా గణేష్ నవరాత్రి వేడుకలు 101 జ్యోతులతో గోమాతకు మహిళలు ప్రత్యేక పూజలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *