Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

వర్షాల కోసం ప్రత్యేక పూజలు…. భుజంగేశ్వరస్వామి ఆలయంలో వరుణ యాగం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వర్షాల కోసం ప్రత్యేక పూజలు…. భుజంగేశ్వరస్వామి ఆలయంలో వరుణ యాగం

వార్త ముఖ్యాంశాలు

  • రైల్వేకోడూరు: సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు పుష్కలంగా పండాలని ఆకాంక్షిస్తూ రైల్వేకోడూరు శ్రీ భుజంగేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక వైదిక పూజలు నిర్వహించారు.
  • దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో వరుణ యాగం, వరుణ జపం, సహస్ర ఘటాభిషేకం భక్తిశ్రద్ధలతో చేపట్టారు.
  • ఈ సందర్భంగా వరుణ దేవుడిని ప్రార్థిస్తూ యాగం, జపం నిర్వహించారు.

రైల్వేకోడూరు: సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు పుష్కలంగా పండాలని ఆకాంక్షిస్తూ రైల్వేకోడూరు శ్రీ భుజంగేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక వైదిక పూజలు నిర్వహించారు. దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో వరుణ యాగం, వరుణ జపం, సహస్ర ఘటాభిషేకం భక్తిశ్రద్ధలతో చేపట్టారు.
ఈ సందర్భంగా వరుణ దేవుడిని ప్రార్థిస్తూ యాగం, జపం నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, రైతుల కష్టానికి తగిన ఫలితం లభించాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి, ముక్కా వరలక్ష్మి, ముక్కా సాయి వికాస్‌రెడ్డి తదితరులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర, చైర్మన్ జయప్రకాశ్, ఎన్డీఏ కూటమి నాయకులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *