Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

రైల్వేకోడూరులో సప్తగిరుల మహాపాదయాత్రకు ఘన స్వాగతం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రైల్వేకోడూరులో సప్తగిరుల మహాపాదయాత్రకు ఘన స్వాగతం

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీనివాస మంగాపురం నుంచి ప్రారంభమైన సప్తగిరుల మహాపాదయాత్ర కోడూరు పట్టణానికి చేరుకుంది.
  • ఏడుకొండల స్వామివారి దర్శనాన్ని లక్ష్యంగా చేసుకుని భక్త బృందం భక్తిశ్రద్ధలతో పాదయాత్ర కొనసాగిస్తోంది.
  • శ్రీనివాస మంగాపురం నుంచి బయలుదేరిన యాత్ర భాకరాపేట, పీలేరు, రాయచోటి, సానిపాయి ఘాట్, రాజంపేట మీదుగా కోడూరు చేరుకుంది.

శ్రీనివాస మంగాపురం నుంచి ప్రారంభమైన సప్తగిరుల మహాపాదయాత్ర కోడూరు పట్టణానికి చేరుకుంది. ఏడుకొండల స్వామివారి దర్శనాన్ని లక్ష్యంగా చేసుకుని భక్త బృందం భక్తిశ్రద్ధలతో పాదయాత్ర కొనసాగిస్తోంది. శ్రీనివాస మంగాపురం నుంచి బయలుదేరిన యాత్ర భాకరాపేట, పీలేరు, రాయచోటి, సానిపాయి ఘాట్, రాజంపేట మీదుగా కోడూరు చేరుకుంది.
కోడూరు పట్టణానికి చేరుకున్న భక్త బృందానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సిహెచ్. రమేష్‌బాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డి.వి. రమణ, ఎలిసెట్టి గుండాల్, కొట్టేపాండు, యనమాలదుర్గ తదితరులు పాల్గొని పాదయాత్రలో పాల్గొంటున్న భక్తులను అభినందించారు. అనంతరం భక్తులు రేణిగుంట, తిరుపతి మీదుగా తిరిగి శ్రీనివాస మంగాపురం చేరుకునేలా మహాపాదయాత్ర కొనసాగించనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *