Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

పుల్లంపేట: జ్ఞానజ్యోతి శిక్షణలో ఆరోగ్యంపై అవగాహన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పుల్లంపేట: జ్ఞానజ్యోతి శిక్షణలో ఆరోగ్యంపై అవగాహన

పుల్లంపేట మండలంలోని ఏపీ మోడల్‌ స్కూల్‌లో జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం ఐదో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా డీఆర్‌పీ ఎస్.వేణుగోపాల్‌ ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే అంశంపై అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, ఆరోగ్యకరమైన అలవాట్లపై వివరించారు. పిల్లల ఆరోగ్యం మెరుగ్గా ఉంటేనే వారి విద్యాభ్యాసం సక్రమంగా సాగి, బంగారు భవిష్యత్తుకు బాటలు పడతాయని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు ఆరోగ్య అంశాలపై అవగాహన పెంచుకుని వాటిని చిన్నారులు, తల్లిదండ్రులకు చేరవేయాలని సూచించారు. కార్యక్రమంలో కే.శంకరయ్య, పీకే కేజీయా లత, ఎం.జయలక్ష్మమ్మ, పార్వతిదేవితో పాటు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

పుల్లంపేట: జ్ఞానజ్యోతి శిక్షణలో ఆరోగ్యంపై అవగాహన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *