Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఇంటింటికి టీడీపీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఇంటింటికి టీడీపీ

వార్త ముఖ్యాంశాలు

  • చిట్వేల్: ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం చిట్వేల్ మండలంలో కొనసాగింది.
  • పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాలేమార్పూరం పంచాయతీ బూత్‌ నంబర్‌ 2 పరిధిలోని ఈడిగపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
  • ఈ సందర్భంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న గ్రామానికి చెందిన పైడి కాల్వ పెంచలయ్యను నాయకులు పరామర్శించారు.

చిట్వేల్: ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం చిట్వేల్ మండలంలో కొనసాగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాలేమార్పూరం పంచాయతీ బూత్‌ నంబర్‌ 2 పరిధిలోని ఈడిగపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న గ్రామానికి చెందిన పైడి కాల్వ పెంచలయ్యను నాయకులు పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులను కలిసి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయంపై చర్యలు చేపట్టారు.
రాష్ట్ర ఖాదీ బోర్డు చైర్మన్ కేకే. చౌదరి హామీ, చొరవతో ప్రభుత్వం మంజూరు చేసిన రూ.67,900 ముఖ్యమంత్రి సహాయ నిధిని గ్రామ ప్రజల సమక్షంలో పెంచలయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా క్షేత్రస్థాయిలో పనిచేస్తామని, అవసరంలో ఉన్న వారికి పార్టీ తరఫున అండగా నిలుస్తామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం ద్వారా వాటి పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకునేలా అధికారులతో సమన్వయం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిట్వేల్ మండల టీడీపీ అధ్యక్షుడు కాకర్ల నాగార్జున నాయుడు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు బాలు రామాంజనేయులు, మాలేమార్పూరం గ్రామ కమిటీ అధ్యక్షుడు దుగ్గిన వెంకటయ్య, టౌన్ కమిటీ అధ్యక్షుడు పగడాల వెంకటేష్, స్థానిక నాయకులు రామకృష్ణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నాగస్వామి, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రజలతో మమేకమై సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని నాయకులు స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *