Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

యలమంచిలి జడ్పీటీసీ బరిలో జనసేన అభ్యర్థి రావి చలపతి.. గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
యలమంచిలి జడ్పీటీసీ బరిలో జనసేన అభ్యర్థి రావి చలపతి.. గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి!

వార్త ముఖ్యాంశాలు

  • అనకాపల్లి జిల్లా యలమంచిలి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున ఏటికొప్పాకకు చెందిన రావి చలపతి ఎన్నికల బరిలో నిలిచారు.
  • యలమంచిలి మండలంలోని గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రజల ముందుకు వస్తున్నారు.
  • గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ సమస్యల పరిష్కారం, మెరుగైన వైద్య సదుపాయాలు, తాగునీటి వసతి కల్పనకు కృషి చేస్తానని పేర్కొంటున్నారు.

అనకాపల్లి జిల్లా యలమంచిలి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున ఏటికొప్పాకకు చెందిన రావి చలపతి ఎన్నికల బరిలో నిలిచారు. యలమంచిలి మండలంలోని గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రజల ముందుకు వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ సమస్యల పరిష్కారం, మెరుగైన వైద్య సదుపాయాలు, తాగునీటి వసతి కల్పనకు కృషి చేస్తానని పేర్కొంటున్నారు. ఏటికొప్పాకకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన లక్క బొమ్మల పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించడంతో పాటు స్థానిక కళాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, యలమంచిలి మండల అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను ఆదరించి తనకు మద్దతుగా నిలవాలని రావి చలపతి ప్రజలను కోరుతున్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingపత్రిక / వెబ్‌సైట్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *