Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

మోదీ జన్మదినం వేళ భక్తి వెలుగులు.. ఏటికొప్పాకలో ఆశీర్వాద దీపాల కార్యక్రమం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మోదీ జన్మదినం వేళ భక్తి వెలుగులు.. ఏటికొప్పాకలో ఆశీర్వాద దీపాల కార్యక్రమం

వార్త ముఖ్యాంశాలు

  • యలమంచిలి, పున్నమి ప్రతినిధి ఆనంద్: ఏటికొప్పాక గ్రామంలో గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సేవా సంకల్ప కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
  • ఇందులో భాగంగా గ్రామంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు చేపట్టారు.
  • వేణుగోపాలస్వామి ఆలయం, శ్రీ శిరిడీ సాయిబాబా మందిరంలో భక్తులు విశేష పూజలు నిర్వహించి ఆశీర్వాద దీపాలను వెలిగించారు.

యలమంచిలి, పున్నమి ప్రతినిధి ఆనంద్:

ఏటికొప్పాక గ్రామంలో గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సేవా సంకల్ప కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు చేపట్టారు. వేణుగోపాలస్వామి ఆలయం, శ్రీ శిరిడీ సాయిబాబా మందిరంలో భక్తులు విశేష పూజలు నిర్వహించి ఆశీర్వాద దీపాలను వెలిగించారు. మోదీ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, దేశ ప్రజలకు మరింత సేవ చేసే శక్తి ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ గ్రామ పెద్దలు, ప్రజలు, భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భజన బృందాల ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణాలు భక్తిశ్రద్ధలతో సందడిగా మారాయి. ఈ కార్యక్రమంలో స్థానికులు, భక్తులు, పెద్దలు పాల్గొని ప్రధానమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *