వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు నగరంలోని విజయమహాల్ గేట్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హరనాథపురానికి చెందిన గయాజ్ బాషా మృతిచెందారు.
- కుడి భుజం ఫ్రాక్చర్‌కు శస్త్రచికిత్స చేస్తుండగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు సమాచారం.
- మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందినట్లు బంధువులు తెలిపారు.
నెల్లూరు నగరంలోని విజయమహాల్ గేట్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హరనాథపురానికి చెందిన గయాజ్ బాషా మృతిచెందారు. కుడి భుజం ఫ్రాక్చర్‌కు శస్త్రచికిత్స చేస్తుండగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు సమాచారం. మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి సంభవించిందంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. అయితే గయాజ్ బాషా కార్డియాక్ అరెస్ట్ కారణంగానే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.