Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

భాష్యం స్కూల్‌లో ఘనంగా కరాటే బెల్ట్ గ్రేడింగ్..!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
భాష్యం స్కూల్‌లో ఘనంగా కరాటే బెల్ట్ గ్రేడింగ్..!

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో అవసరం : మున్సిపల్ చైర్‌పర్సన్ పిల్లా రామకుమారి యలమంచిలిలోని ఎన్.వి.ఆర్.
  • సెల్ఫ్ డిఫెన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో భాష్యం స్కూల్‌లో కరాటే బెల్ట్ గ్రేడింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
  • ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ పిల్లా రామకుమారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ఆత్మరక్షణ విద్య అవసరమని, మార్షల్ ఆర్ట్స్‌తో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెరుగుతాయని తెలిపారు.ఈ గ్రేడింగ్ పరీక్షల్లో మొత్తం 32 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో అవసరం : మున్సిపల్ చైర్‌పర్సన్ పిల్లా రామకుమారి

యలమంచిలిలోని ఎన్.వి.ఆర్. సెల్ఫ్ డిఫెన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో భాష్యం స్కూల్‌లో కరాటే బెల్ట్ గ్రేడింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ పిల్లా రామకుమారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ఆత్మరక్షణ విద్య అవసరమని, మార్షల్ ఆర్ట్స్‌తో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెరుగుతాయని తెలిపారు.ఈ గ్రేడింగ్ పరీక్షల్లో మొత్తం 32 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎల్లో బెల్ట్‌కు 11 మంది, గ్రీన్ బెల్ట్‌కు 12 మంది, ఆరెంజ్ బెల్ట్‌కు ముగ్గురు, బ్రౌన్ బెల్ట్‌కు ఆరుగురు పరీక్షలు రాశారు. బ్రౌన్ బెల్ట్ విభాగంలో ఎస్.కె. ఆఫ్రీన్, కే. హైతీ, బి. వైష్ణవి, పి. వర్షిణి, ఎస్.కె. ఆయేషా, ఎస్. జయసూర్య ప్రతిభ కనబరిచారు. రామచంద్రాపురానికి చెందిన బి.కె. రత్నం ఎగ్జామినర్‌గా వ్యవహరించారు.అకాడమీ నిర్వాహకులు శిహాన్ నక్కా వెంకట్రామన్ మాట్లాడుతూ కరాటే సాధన విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, మానసిక బలాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో 22వ వార్డు కౌన్సిలర్ దాడి రమేష్, ప్రిన్సిపాల్ అనిమిరెడ్డి దేముడు బాబు, నక్కా శివశంకర్ రావు, టీవీఎస్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • కె. ఆనంద్పత్రిక / వెబ్‌సైట్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *