Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

భవన నిర్మాణ కార్మికులకు రూ.10 లక్షల ప్రమాద బీమా ఇవ్వాలి..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
భవన నిర్మాణ కార్మికులకు రూ.10 లక్షల ప్రమాద బీమా ఇవ్వాలి..

వార్త ముఖ్యాంశాలు

  • అనకాపల్లి, సెప్టెంబర్ 30:పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) భవన నిర్మాణ కార్మికులకు రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని, వారి సంక్షేమానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు.
  • రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం అనకాపల్లి లేబర్ కార్యాలయంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌కు వినతిపత్రం అందజేశారు.
  • ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో సుమారు రూ.4,500 కోట్ల నిధులు ఉన్నప్పటికీ, బోర్డు ప్రారంభమైనప్పటి నుంచి కేవలం రూ.1,500 కోట్లు మాత్రమే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేశారని పేర్కొన్నారు.

అనకాపల్లి, సెప్టెంబర్ 30:పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో )

భవన నిర్మాణ కార్మికులకు రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని, వారి సంక్షేమానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం అనకాపల్లి లేబర్ కార్యాలయంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో సుమారు రూ.4,500 కోట్ల నిధులు ఉన్నప్పటికీ, బోర్డు ప్రారంభమైనప్పటి నుంచి కేవలం రూ.1,500 కోట్లు మాత్రమే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేశారని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమ నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించకుండా పూర్తిగా కార్మికుల ప్రయోజనాలకే వినియోగించాలని కోరారు.గతంలో భవన నిర్మాణ కార్మికులకు 12 రకాల సంక్షేమ పథకాలు అమలు చేసేవారని, కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా కేవలం నాలుగు సంక్షేమ పథకాలను మాత్రమే ప్రకటించిందని విమర్శించారు. కార్మికుల సంక్షేమ నిధులను ఇతర పథకాలకు మళ్లించడంతో పాటు ప్రచార కార్యక్రమాలకు వినియోగించడం సరికాదన్నారు.ప్రమాదాల్లో మరణించే భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుడి కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని . అంగవైకల్యానికి గురైన కార్మికులకు కూడా సంక్షేమ బోర్డు ద్వారా తగిన ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *