Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

ప్రతి ఊరికి సంక్షేమ భరోసా సంఘం..!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ప్రతి ఊరికి సంక్షేమ భరోసా సంఘం..!

వార్త ముఖ్యాంశాలు

  • అన్నవరప్పాడు సదస్సులో కర్రి వెంకటరమణ పిలుపు..!!
  • పున్నమి - కే ఆనంద్ (అనకాపల్లి బ్యూరో ) : ప్రతి గ్రామంలో సంక్షేమ భరోసా సంఘాలను ఏర్పాటు చేసి మహిళల అభివృద్ధి, భద్రత, స్వయం ఉపాధికి ప్రోత్సాహం కల్పించాలని శ్రీ కృష్ణదేవరాయ సంక్షేమ భరోసా కేంద్రాల వ్యవస్థాపకులు కర్రి వెంకటరమణ పిలుపునిచ్చారు.
  • పెరవలి మండలం అన్నవరప్పాడులో పొప్పాపు నాగేశ్వరరావు, పొప్పాపు సూర్య నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సంక్షేమ భరోసా అవగాహన సదస్సు నిర్వహించారు.

అన్నవరప్పాడు సదస్సులో కర్రి వెంకటరమణ పిలుపు..!!

పున్నమి – కే ఆనంద్ (అనకాపల్లి బ్యూరో ) :

ప్రతి గ్రామంలో సంక్షేమ భరోసా సంఘాలను ఏర్పాటు చేసి మహిళల అభివృద్ధి, భద్రత, స్వయం ఉపాధికి ప్రోత్సాహం కల్పించాలని శ్రీ కృష్ణదేవరాయ సంక్షేమ భరోసా కేంద్రాల వ్యవస్థాపకులు కర్రి వెంకటరమణ పిలుపునిచ్చారు.

పెరవలి మండలం అన్నవరప్పాడులో పొప్పాపు నాగేశ్వరరావు, పొప్పాపు సూర్య నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సంక్షేమ భరోసా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్రి వెంకటరమణతో పాటు సావిత్రిబాయి పూలే మహిళా సంక్షేమ భరోసా సంఘం అధ్యక్షురాలు కేశవభట్ల వాణిశ్రీ, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ అసోసియేట్స్ నడిగెట్ల శేషు, నరసా శేషు, టివియస్ ప్రకాష్, ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కర్రి వెంకటరమణ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు అవసరమైన అవగాహన, సహాయ సహకారాలు అందించడంతో పాటు స్వయం ఉపాధికి ప్రోత్సాహం కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న మహిళలు గ్రూపులుగా ఏర్పడి ముందుకు వస్తే జ్యూట్ బ్యాగుల తయారీ, కుట్టు శిక్షణ, బ్యూటీ పార్లర్ కోర్సులు తదితర నైపుణ్య శిక్షణలు అందిస్తామని చెప్పారు.
అలాగే డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా హోమ్ కేర్, పర్సనల్ కేర్, హెల్త్ కేర్ తదితర ఉత్పత్తుల విక్రయం ద్వారా ఆదాయం పొందే అవకాశాలపై అవగాహన కల్పిస్తామని వివరించారు. ప్రతి ఒక్కరూ సమాజంలో నిజాయితీగా జీవిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
కార్యక్రమానికి సహకరించిన పిండి మారయ్య, లీలలను నిర్వాహకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పి. నాగేశ్వరరావు, రంగనీడి గంగాధర్, సూర్య నాగేశ్వరరావు, మారయ్యతో పాటు గ్రామానికి చెందిన మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *