Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

పెద్ద అవుటపల్లిలో బ్రదర్ జోసెఫ్ తంబి 81వ వర్ధంతి పోస్టర్ ఆవిష్కరణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పెద్ద అవుటపల్లిలో బ్రదర్ జోసెఫ్ తంబి 81వ వర్ధంతి పోస్టర్ ఆవిష్కరణ
{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":[],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}

వార్త ముఖ్యాంశాలు

  • ​పెద్ద అవుటపల్లి, పున్నమి ప్రతినిధి సురేష్ కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి పుణ్యక్షేత్రంలో బ్రదర్ జోసెఫ్ తంబి 81వ వర్ధంతి మహోత్సవాల గోడ పత్రికను గుడి పెద్దలు, సంఘ పెద్దలు మరియు మీడియా మిత్రుల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు.
  • ఈ సందర్భంగా జనవరి 13, 14, 15 తేదీల్లో జరగనున్న ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
  • ​దేశవ్యాప్తంగా తరలిరానున్న ఈ మహోత్సవాలకు కర్ణాటక, కేరళ, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి వేలాదిగా భక్తులు తరలిరానున్నారు.

​పెద్ద అవుటపల్లి, పున్నమి ప్రతినిధి సురేష్

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి పుణ్యక్షేత్రంలో బ్రదర్ జోసెఫ్ తంబి 81వ వర్ధంతి మహోత్సవాల గోడ పత్రికను గుడి పెద్దలు, సంఘ పెద్దలు మరియు మీడియా మిత్రుల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనవరి 13, 14, 15 తేదీల్లో జరగనున్న ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
​దేశవ్యాప్తంగా తరలిరానున్న ఈ మహోత్సవాలకు కర్ణాటక, కేరళ, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి వేలాదిగా భక్తులు తరలిరానున్నారు.
​అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పుణ్యక్షేత్రానికి వచ్చే ప్రతి భక్తుడు సంతోషంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునేలా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
​ ఈ కార్యక్రమ విజయవంతానికి సహకరిస్తున్న పోలీస్, వైద్య, ఫైర్, ఎలక్ట్రికల్, పంచాయతీ రాజ్ శాఖల అధికారులకు మరియు సిబ్బందికి కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
​ బ్రదర్ జోసెఫ్ తంబి ఈ గ్రామంలోనే నివసించి, ఇక్కడే సమాధి అయ్యారని, ఆయన సమాధి చెంత ప్రార్థనలు చేయడం వల్ల ఎంతోమంది భక్తులకు అద్భుతాలు జరిగాయని గ్రామస్తులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
​ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పుణ్యక్షేత్ర బాధ్యులు, గ్రామ పెద్దలు వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాబోయే మూడు రోజుల ఉత్సవాలను విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. మీ అందరికీ కూడా ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాము.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *