Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

మహబూబాబాద్ లో బాలబాలికల క్రీడా పోటీలు ప్రారంభం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • మహబూబాబాద్‌లో 17 బాల బాలికల క్రీడా పోటీలు ప్రారంభం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో 17 బాల బాలికల క్రీడా పోటీలను ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గారు ప్రారంభించారు.
  • ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని అన్నారు.
  • క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలను పెంపొందిస్తాయని తెలిపారు.

మహబూబాబాద్‌లో 17 బాల బాలికల క్రీడా పోటీలు ప్రారంభం

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో 17 బాల బాలికల క్రీడా పోటీలను ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని అన్నారు. క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలను పెంపొందిస్తాయని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లోని బాల బాలికల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారికి సరైన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్‌లు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *