Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

పెడపర్తిలో 36 కుటుంబాలు కూటమిలో చేరిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పెడపర్తిలో 36 కుటుంబాలు కూటమిలో చేరిక

వైసీపీని వీడి టీడీపీ, బీజేపీలో చేరిక

అనపర్తి, అక్టోబరు 4 (పున్నమి ప్రతినిధి): అనపర్తి మండలం పెడపర్తి గ్రామంలో వైసీపీకి చెందిన 36 కుటుంబాలు ఆ పార్టీని వీడి కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీలో చేరాయి. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన 10 కుటుంబాలకు కాషాయ కండువాలు కప్పి స్వాగతించారు. టీడీపీలో చేరిన 26 కుటుంబాలకు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో ఇదే గ్రామానికి చెందిన 20 కుటుంబాలు కూటమిలో చేరగా, తాజాగా మరో 36 కుటుంబాలు చేరడం విశేషం. వైసీపీ నాయకత్వంపై అసంతృప్తితో పాటు నల్లమిల్లి కుటుంబం నాయకత్వంపై విశ్వాసంతో కూటమిలో చేరినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పెడపర్తిలో 36 కుటుంబాలు కూటమిలో చేరిక

పెడపర్తిలో 36 కుటుంబాలు కూటమిలో చేరిక

పెడపర్తిలో 36 కుటుంబాలు కూటమిలో చేరిక

Leave a comment

Your email address will not be published. Required fields are marked *