Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

పింఛన్ దరఖాస్తు గడువు పొడిగించాలి.. ప్రభుత్వాన్ని కోరిన సంఘం నాయకులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పింఛన్ దరఖాస్తు గడువు పొడిగించాలి.. ప్రభుత్వాన్ని కోరిన సంఘం నాయకులు

వార్త ముఖ్యాంశాలు

  • చిట్వేల్‌: అర్హులైన వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువును సెప్టెంబర్‌ 30 వరకు పొడిగించాలని ఏపీ వికలాంగులు, పింఛన్‌దారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.ఎన్.
  • ఆంధ్రయ్య ప్రభుత్వాన్ని కోరారు.
  • ప్రస్తుతం సెప్టెంబర్‌ 7 నుంచి 16 వరకు మాత్రమే అవకాశం కల్పించారని తెలిపారు.

చిట్వేల్‌: అర్హులైన వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువును సెప్టెంబర్‌ 30 వరకు పొడిగించాలని ఏపీ వికలాంగులు, పింఛన్‌దారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.ఎన్. ఆంధ్రయ్య ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం సెప్టెంబర్‌ 7 నుంచి 16 వరకు మాత్రమే అవకాశం కల్పించారని తెలిపారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు 10–15 రోజులు పడుతున్నందున గడువు పెంచాలని కోరారు. 2025 నుంచి సదరం ధ్రువీకరణ కోసం వైద్య పరీక్షలు చేయించుకున్న పలువురు వికలాంగులకు ఇప్పటికీ ధ్రువీకరణ పత్రాలు అందలేదన్నారు. అర్హులను పరిశీలించి పింఛన్లు మంజూరు చేయాలని, వికలాంగులకు ఇంటి స్థలాలు, పక్కా ఇళ్లు, సబ్సిడీ రుణాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కె. నాగమణి, ఎం. సుబ్బారాయుడు, ఆర్. నరసింహరాజు, కె. పెద్దయ్యనాయుడు, జె. విశ్వనాథ్, డి. శంకర్‌రెడ్డి, రత్నమ్మ, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *