Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

పింఛన్ల హామీలు ఏమయ్యాయి? నిలదీస్తున్న వయోవృద్ధులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పింఛన్ల హామీలు ఏమయ్యాయి? నిలదీస్తున్న వయోవృద్ధులు

వార్త ముఖ్యాంశాలు

  • పింఛన్ల హామీలు ఏమయ్యాయి?
  • ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వృద్ధులు ​కామారెడ్డి: సెప్టెంబర్ 20 (పున్నమి ప్రతినిధి) ​ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీలు పింఛన్ల విషయంలో ఎన్నో హామీలు ఇచ్చాయి.
  • కానీ, అధికారం చేపట్టిన తర్వాత ఏ ఒక్క పార్టీ  పింఛన్ల గురించి అసెంబ్లీలో మాట్లాడటం లేదు.

పింఛన్ల హామీలు ఏమయ్యాయి? ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వృద్ధులు

​కామారెడ్డి: సెప్టెంబర్ 20 (పున్నమి ప్రతినిధి)

​ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీలు పింఛన్ల విషయంలో ఎన్నో హామీలు ఇచ్చాయి. కానీ, అధికారం చేపట్టిన తర్వాత ఏ ఒక్క పార్టీ  పింఛన్ల గురించి అసెంబ్లీలో మాట్లాడటం లేదు. ఈ సమస్యను గమనించిన పద్మశ్రీ మందకృష్ణ మాది గ  గత ఐదు నెలలుగా పింఛను దారులను ఏకం చేసి పోరాటాలు చేస్తున్నారు.ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయా లు, మున్సిపల్ కార్యాలయాలు, గ్రామ పంచాయ తీ కార్యాలయాల ముట్టడి వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో నిరసనలు తెలియజేస్తూ, పంచా యతీ కార్యదర్శులకు వినతిపత్రాలు అందజేస్తు న్నామని అన్నారు.ఈ నిరసన కార్యక్రమాల్లో ఎ మ్మార్పీస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కామారెడ్డి జిల్లా మాజీ కార్యదర్శి కొత్తోల్ల యాదగిరి మాదిగ, వి హెచ్ పి ఎస్ నాయకులు ఆకుల రాజ య్య, రాజా గౌడ్, ఆకుల చిన్న రాజయ్య,వంగ దేవయ్య, పురం నరసయ్య, నాదరి బాలయ్యతో పాటు పందుల మల్లయ్య, కాల బాలయ్య, సూరం పల్లి మొగులయ్య, ఆల నారాయణరెడ్డి, బత్తుల సాయిలు, ఆకుల లక్ష్మి, తాటికొండ లక్ష్మి, కాల మణెమ్మ వంటి వయోవృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *