వార్త ముఖ్యాంశాలు
- *పాసుపుస్తకాల పంపిణీ, రీసర్వే త్వరగా పూర్తి చేయాలి* *రెవెన్యూ అంశాలపై జాయింట్ కలెక్టర్ సమీక్ష* విజయనగరం, జిల్లా బ్యూరో రమణ, సెప్టెంబరు 1: పున్నమి ప్రతినిధి అక్టోబర్ నెలలో మొత్తం 81 గ్రామాల్లో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ ఆదేశించారు.
- జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై జేసి సేధు మాధవన్ మంగళవారం రెవెన్యూ అధికారులతో వర్చువల్‌గా సమీక్షా సమావేశం నిర్వహించారు.
- ఈ సందర్భంగా అక్టోబర్ నెలలో పట్టాదారు పాస్బుక్ల పంపిణీకి ఎంపిక చేసిన 81 గ్రామాల్లో ప్రగతి, రీసర్వే పనులు, మాన్యువల్ రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారం, వెబ్‌ల్యాండ్ మ్యుటేషన్లు, 22ఏ దరఖాస్తుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు.
*పాసుపుస్తకాల పంపిణీ, రీసర్వే త్వరగా పూర్తి చేయాలి*
*రెవెన్యూ అంశాలపై జాయింట్ కలెక్టర్ సమీక్ష*
విజయనగరం, జిల్లా బ్యూరో రమణ, సెప్టెంబరు 1: పున్నమి ప్రతినిధి
అక్టోబర్ నెలలో మొత్తం 81 గ్రామాల్లో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ ఆదేశించారు. జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై జేసి సేధు మాధవన్ మంగళవారం రెవెన్యూ అధికారులతో వర్చువల్‌గా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్టోబర్ నెలలో పట్టాదారు పాస్బుక్ల పంపిణీకి ఎంపిక చేసిన 81 గ్రామాల్లో ప్రగతి, రీసర్వే పనులు, మాన్యువల్ రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారం, వెబ్‌ల్యాండ్ మ్యుటేషన్లు, 22ఏ దరఖాస్తుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. అక్టోబర్ నెలకు ఎంపిక చేసిన గ్రామాల్లో మొత్తం 27,598 ఖాతాలకు సంబంధించి 18,082 ఖాతాలకు ఈ-కేవైసీ పూర్తయినట్లు, 9,516 ఖాతాలు పెండింగ్‌లో ఉన్నట్లు సమీక్షలో వెల్లడైంది. ఈ ప్రక్రియను వేగవంతం చేసి మిగిలిన ఖాతాలను త్వరితగతిన పూర్తి చేయాలని, గతనెలలో మిగిలిపోయిన 21 గ్రామాలను కూడా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
అలాగే రీసర్వే ఫేజ్–4లో 126 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయినప్పటికీ, వివిధ లాగిన్ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్న పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. ఫేజ్–5 రీసర్వే వెక్టరైజేషన్ పనుల ప్రగతిని కూడా సమీక్షించారు. జిల్లాలో 102 గ్రామాలకు సంబంధించి వెక్టరైజేషన్ పురోగతిని పరిశీలించి, మిగిలిన పనులను వేగవంతం చేయాలని సూచించారు. రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్లో జిల్లావ్యాప్తంగా 983 గ్రామాలకు సంబంధించిన పనుల్లో స్కానింగ్ పురోగతిని సమీక్షించారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించి, పెండింగ్ ఫిర్యాదుల సంఖ్యను తగ్గించాలని, వెబ్‌ల్యాండ్ మ్యుటేషన్లు, 22ఏ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు సంబంధించిన రెవెన్యూ సేవలను నిర్ణీత గడువులోగా పారదర్శకంగా అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
జిల్లా కేంద్రం నుంచి డీఆర్వో సిహెచ్. సత్తిబాబు, సర్వే ఏడీ విజయకుమార్ సమీక్షలో పాల్గొన్నారు.