Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

పాడేరు నియోజకవర్గంలో మౌలిక వసతులకు ప్రాధాన్యం: కలెక్టర్ నిషాంతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పాడేరు నియోజకవర్గంలో మౌలిక వసతులకు ప్రాధాన్యం: కలెక్టర్ నిషాంతి

వార్త ముఖ్యాంశాలు

  • పాడేరు ఏజెన్సీ ప్రజలకు రహదారులు, సురక్షిత తాగునీరు, ప్రాథమిక మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని కలెక్టర్ నిషాంతి తెలిపారు.
  • రూ.59.51 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా రూ.24.21 కోట్లతో పూర్తిచేసిన 13 బీటీ రోడ్లు, రూ.1.80 కోట్లతో నిర్మించిన వన్‌స్టాప్‌ సెంటర్‌ను ప్రారంభించారు.
  • పాడేరు, చింతపల్లి మండలాల్లో రూ.33.50 కోట్లతో చేపట్టనున్న మల్టీ విలేజ్ తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు.

పాడేరు ఏజెన్సీ ప్రజలకు రహదారులు, సురక్షిత తాగునీరు, ప్రాథమిక మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని కలెక్టర్ నిషాంతి తెలిపారు. రూ.59.51 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా రూ.24.21 కోట్లతో పూర్తిచేసిన 13 బీటీ రోడ్లు, రూ.1.80 కోట్లతో నిర్మించిన వన్‌స్టాప్‌ సెంటర్‌ను ప్రారంభించారు. పాడేరు, చింతపల్లి మండలాల్లో రూ.33.50 కోట్లతో చేపట్టనున్న మల్టీ విలేజ్ తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు. మారుమూల గిరిజన గ్రామాలకు అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *