Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్‌.. అరకు పోలీస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ నిరసన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్‌.. అరకు పోలీస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ నిరసన

అరకు లోయ, అక్టోబర్ 08: చీప్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు అరకు లోయ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. ఓటు చోరీ ఆరోపణలపై ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీ, ఇండియా కూటమి ఎంపీలపై ఢిల్లీలో పోలీసుల చర్యలను నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజల ఓటు హక్కు, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శతక బుల్లిబాబు, అరకు నియోజకవర్గ ఇన్‌చార్జ్ శెట్టి గంగాధర్ స్వామి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్‌.. అరకు పోలీస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ నిరసన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *