వార్త ముఖ్యాంశాలు
- పాడేరు, అక్టోబర్ 08: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లాల వారీగా సన్నద్ధతను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు.
- గురువారం కలెక్టర్లు, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
- వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా ప్రక్రియను వేగవంతం చేయాలని, ఎన్నికల సిబ్బందికి సమగ్ర శిక్షణ ఇవ్వాలని సూచించారు.
పాడేరు, అక్టోబర్ 08: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లాల వారీగా సన్నద్ధతను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్లు, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా ప్రక్రియను వేగవంతం చేయాలని, ఎన్నికల సిబ్బందికి సమగ్ర శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఎన్నికల షెడ్యూల్‌పై సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మకుండా, అధికారిక ప్రకటనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు ప్రాధాన్యతనిస్తూ సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో పాడేరు జేసీ తిరుమణి శ్రీపూజ, ASP శృతి, జిల్లా పంచాయితీ అధికారి చంద్రశేఖర్, DDO జయప్రకాశ్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.