Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

పవన్ జన్మదిన వేడుకల్లో సేవా స్ఫూర్తి.. బిక్కవోలులో కూటమి నేతల సందడి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పవన్ జన్మదిన వేడుకల్లో సేవా స్ఫూర్తి.. బిక్కవోలులో కూటమి నేతల సందడి

బిక్కవోలు: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా బిక్కవోలులో కూటమి నేతలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జనసేన ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి, జనసేన సమన్వయకర్త రావాడ నాగు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం దేవస్థానం ఆవరణలో మొక్కలు నాటి, కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. యాచకులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. బిక్కవోలు నుంచి అనపర్తి వరకు నిర్వహించిన బైక్ ర్యాలీని ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రారంభించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

పవన్ జన్మదిన వేడుకల్లో సేవా స్ఫూర్తి.. బిక్కవోలులో కూటమి నేతల సందడి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *