Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన జ్యోతుల నవీన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన జ్యోతుల నవీన్

వార్త ముఖ్యాంశాలు

  • *బాధిత కుటుంబాలకు అండగా జ్యోతుల నవీన్..
  • రూ.78 వేల సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ..* కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, అక్టోబర్ 12: స్థానిక రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ సోమవారం ముఖ్యమంత్రి సహాయ…
  • 78,000 విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన స్వయంగా అందజేశారు.

*బాధిత కుటుంబాలకు అండగా జ్యోతుల నవీన్.. రూ.78 వేల సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ..*

కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, అక్టోబర్ 12:
స్థానిక రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.జగ్గంపేట మండలం గుర్రంపాలెం శివారు సగరపేటకు చెందిన ఇద్దరు లబ్ధిదారులకు రూ. 78,000 విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. సీఎం సహాయ నిధి ద్వారా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నియోజకవర్గంలో తమ సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు జీనుమణి బాబు, జిల్లా టిడిపి అధికార ప్రతినిధి రేఖా బుల్లి రాజు, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ ఎస్ ఏ గపూర్, సీనియర్ టిడిపి నాయకులు కుంచే తాతాజీ, మండల టిడిపి ఉపాధ్యక్షులు పోండ్రు బాలనాగు, నక్క వెంకటేష్, బత్తుల వెంకన్న, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *