Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మేడ్చల్ – మల్కాజిగిరి

పద్మానగర్ ఫేజ్–1 నీటి సమస్య కు శాశ్వతంగా పరిష్కరిస్తానన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పద్మానగర్ ఫేజ్–1 నీటి సమస్య కు శాశ్వతంగా పరిష్కరిస్తానన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌

వార్త ముఖ్యాంశాలు

  • కుత్బుల్లాపూర్: జీడిమెట్ల సర్కిల్ పరిధిలోని పద్మానగర్ ఫేజ్–1 కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ అధికారులను కోరారు.
  • సోమవారం కాలనీని సందర్శించిన ఆయన, స్థానికులతో మాట్లాడి నీటి సరఫరా సమస్యలను తెలుసుకున్నారు.
  • అనంతరం కాలనీ వాసులతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో జలమండలి జనరల్ మేనేజర్ మాధవిని కలిసి సమస్యను వివరించారు.

కుత్బుల్లాపూర్: జీడిమెట్ల సర్కిల్ పరిధిలోని పద్మానగర్ ఫేజ్–1 కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ అధికారులను కోరారు.

సోమవారం కాలనీని సందర్శించిన ఆయన, స్థానికులతో మాట్లాడి నీటి సరఫరా సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కాలనీ వాసులతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో జలమండలి జనరల్ మేనేజర్ మాధవిని కలిసి సమస్యను వివరించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి నిరంతరాయంగా తాగునీటి సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

తాత్కాలిక చర్యలతో పాటు శాశ్వత పరిష్కారం చూపాలని కూన శ్రీశైలం గౌడ్‌ కోరారు.ఈ సందర్భంగా కాలనీ వాసులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు మరియు డివిజన్ కాంగ్రెస్ నాయకుడు గడ్డం రాజేందర్ రెడ్డి, దుర్గారావుతో పాటు స్థానిక కాలనీవాసులు ముత్యాలు, శివ నాగిరెడ్డి, మోహన్ సుబ్బారెడ్డి, భాస్కర్ రెడ్డి, వేణు, సత్యం, సురేందర్ రెడ్డి, వెంకటేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *