Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మేడ్చల్ – మల్కాజిగిరి

అమ్మవారి ఓడి బియ్యం అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అమ్మవారి ఓడి బియ్యం అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్

వార్త ముఖ్యాంశాలు

  • జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దమ్ నగర్ లోని అమ్మవారి ఆలయంలో బోనాల పండుగ సందర్భంగా భక్తులు సమర్పించిన ఓడి బియ్యం తో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు.
  • ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానాన్ని ప్రారంభించారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో డివిజన్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.

జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దమ్ నగర్ లోని అమ్మవారి ఆలయంలో బోనాల పండుగ సందర్భంగా భక్తులు సమర్పించిన ఓడి బియ్యం తో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో డివిజన్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. అమ్మవారి ఓడి బియ్యం అన్నప్రసాదం కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం విజయవంతంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొలుకుల జైహింద్, ఆలయ కమిటీ అడ్వైజర్ కొలుకుల సత్యనారాయణ, ఆలయకమిటీ చైర్మన్ నారా నరేందర్, కోశాధికారి విట్టల్ గౌడ్, సభ్యులు రాజేష్ రాయి, విగ్నేష్ రాయి, వినోద్ కుమార్, సతీష్, జైపాల్ రెడ్డి, మైలారం రాజు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *