వార్త ముఖ్యాంశాలు
- తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ మల్కాజిగిరి–మౌలాలి సర్కిల్ నూతన పాలకవర్గ ఎన్నికలు నేరేడుమెట్‌లోని అంబేద్కర్ భవనంలో ప్రశాంత వాతావరణంలో జరిగాయి.
- తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.
- నర్సింగరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు మరియు ప్రాథమిక కమిటీ సభ్యుల సమక్షంలో ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ పూర్తయింది.
తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ మల్కాజిగిరి–మౌలాలి సర్కిల్ నూతన పాలకవర్గ ఎన్నికలు నేరేడుమెట్‌లోని అంబేద్కర్ భవనంలో ప్రశాంత వాతావరణంలో జరిగాయి. తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి. నర్సింగరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు మరియు ప్రాథమిక కమిటీ సభ్యుల సమక్షంలో ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ పూర్తయింది. సభ్యులందరి ఆమోదంతో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పి. నర్సింగరావు మాట్లాడుతూ, వయోవృద్ధులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, ప్రభుత్వం కేటాయించే నిధులు నేరుగా వారి వద్దకే చేరేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. నూతనంగా ఎన్నికైన ప్రతినిధులు మాట్లాడుతూ… సీనియర్ సిటిజన్స్ హక్కుల సాధనకు, వారి సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు.
నూతన పాలకవర్గ సభ్యులు:
అధ్యక్షుడు: భానుమూర్తి
ఉపాధ్యక్షులు: కే. విజయ్ కుమార్, బి. అశోక్
ప్రధాన కార్యదర్శి: ఎల్. కిష్టయ్య
జాయింట్ సెక్రెటరీ: జి. శ్రీనివాస్
ఆర్గనైజర్: కే. బాలస్వామి
కోశాధికారి: జి.వి.ఎస్. సత్యనారాయణ
ఈసీ సభ్యులు: ఆర్.వి. సూరిబాబు, ఏ. మహేశ్వరరావు, పి. రాములు గౌడ్, బి. ఈశ్వర్ గౌడ్, వి.టి. కృష్ణ