Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

నవంబర్ 22న స్వేరో ఆత్మీయ సమ్మేళనం వాల్ పోస్టర్ ఆవిష్కరణ.. సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నవంబర్ 22న స్వేరో ఆత్మీయ సమ్మేళనం వాల్ పోస్టర్ ఆవిష్కరణ.. సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపు

ఖానాపురం పున్నమి ప్రతినిధి:
ఖానాపురం: హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో నవంబర్ 22న నిర్వహించనున్న స్వేరో ఆత్మీయ సమ్మేళనం వాల్ పోస్టర్‌ను ఖానాపురం మండల స్వేరో కన్వీనర్ నేలమారి నాగరాజు అధ్యక్షతన ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ODCMS చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్, మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, మాజీ AMC చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట నరసయ్య పాల్గొన్నారు.
స్వేరోస్ వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, ఆత్మగౌరవం అనే స్వేరో భావజాలంతో సామాజిక చైతన్యాన్ని విస్తరించేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని కోరారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్వేరో నాయకులు, పూర్వ విద్యార్థులు, బహుజనవాదులు, ప్రజాస్వామికవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో స్వేరో నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల కన్వీనర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నవంబర్ 22న స్వేరో ఆత్మీయ సమ్మేళనం వాల్ పోస్టర్ ఆవిష్కరణ.. సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *