Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

నల్లబెల్లిలో బీఆర్ఎస్ బైక్ ర్యాలీ.. కరువు మండలంగా ప్రకటించాలని ధర్నా. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నల్లబెల్లిలో బీఆర్ఎస్ బైక్ ర్యాలీ.. కరువు మండలంగా ప్రకటించాలని ధర్నా. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

ఖానాపురం పున్నమి ప్రతినిధి:
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలపై చర్చించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని ఉత్సాహంగా నిర్వహించారు.
అనంతరం నల్లబెల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రభుత్వం గుర్తించి, నల్లబెల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలు, రైతుల సమస్యలపై నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నల్లబెల్లిలో బీఆర్ఎస్ బైక్ ర్యాలీ.. కరువు మండలంగా ప్రకటించాలని ధర్నా. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *