Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

దొరవారిసత్రంలో ప్రతి గురువారం కూరగాయల సంత – తక్కువ ధరలకే తాజా కూరగాయలు*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దొరవారిసత్రంలో ప్రతి గురువారం కూరగాయల సంత – తక్కువ ధరలకే తాజా కూరగాయలు*

వార్త ముఖ్యాంశాలు

  • *దొరవారిసత్రం, ఆగస్టు 28 (పున్నమి న్యూస్)* తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండల కేంద్రంలో ప్రతి గురువారం నిర్వహించే వారపు కూరగాయల సంతకు విశేష ఆదరణ లభిస్తోంది.
  • రైతులు తమ పొలాల్లో పండించిన తాజా కూరగాయలను నేరుగా సంతకు తీసుకువచ్చి అతి తక్కువ ధరలకే విక్రయిస్తున్నారు.
  • దళారుల ప్రమేయం లేకుండా రైతు నుండి నేరుగా వినియోగదారునికి కూరగాయలు లభించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

*దొరవారిసత్రం, ఆగస్టు 28 (పున్నమి న్యూస్)*

తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండల కేంద్రంలో ప్రతి గురువారం నిర్వహించే వారపు కూరగాయల సంతకు విశేష ఆదరణ లభిస్తోంది.

రైతులు తమ పొలాల్లో పండించిన తాజా కూరగాయలను నేరుగా సంతకు తీసుకువచ్చి అతి తక్కువ ధరలకే విక్రయిస్తున్నారు. దళారుల ప్రమేయం లేకుండా రైతు నుండి నేరుగా వినియోగదారునికి కూరగాయలు లభించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

టమోటా, ఉల్లి, బెండ, వంకాయ, బీర, సొర తదితర అన్ని రకాల కూరగాయలు మార్కెట్ కన్నా తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఉదయం నుండే సంత కిటకిటలాడుతోంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు.

రైతులకు మద్దతుగా, ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన కూరగాయలు అందించేందుకు ఈ సంత ఎంతో ఉపయోగకరంగా ఉందని స్థానికులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *