Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దేపూరులో ఘనంగా వెంకయ్య స్వామి 36వ ఆరాధనా మహోత్సవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దేపూరులో ఘనంగా వెంకయ్య స్వామి 36వ ఆరాధనా మహోత్సవం

ఆత్మకూరు, ఆగస్టు 24 (పున్నమి ప్రతినిధి):** దేపూరు గ్రామంలోని శ్రీశ్రీశ్రీ భగవాన్‌ వెంకయ్య స్వామి, హనుమాన్‌ భక్త పెంచలస్వామి ఆశ్రమంలో వెంకయ్య స్వామి 36వ ఆరాధనా మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు.

తెల్లవారుజాము స్వామివారి సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం స్వామివారికి పాలాభిషేకం, సహస్రనామావళి, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.

సాయంత్రం ప్రత్యేక పూజలు, తీర్థప్రసాదాలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాత్రి దేపూరు గ్రామస్థుల ఆధ్వర్యంలో పండరి భజన కార్యక్రమం జరగనుంది. సోమవారం తెల్లవారుజామున అగ్నిగుండ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆశ్రమ కమిటీ తెలిపింది.
అనంతరం స్వామివారిని ప్రత్యేక పూలతో అలంకరించి, మేళతాళాలు, బాణసంచా నడుమ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ మహోత్సవంలో ఆశ్రమ కమిటీ సభ్యులు, స్వామివారి భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

దేపూరులో ఘనంగా వెంకయ్య స్వామి 36వ ఆరాధనా మహోత్సవం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *