Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కనులపండువగా రాములోరి కళ్యాణోత్సవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కనులపండువగా రాములోరి కళ్యాణోత్సవం

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 24 (పున్నమి ప్రతినిధి) వెంకటాచలం మండలం చౌటపాళెంలో శ్రీ కోదండరామస్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది.
  • భారత 13వ రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కలిసి శ్రీ సీతాలక్ష్మణ హనుమాన్ సమేత శ్రీ కోదండరాముడిని దర్శించుకున్నారు.
  • ఆలయ అర్చకులు సంప్రదాయ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ మర్యాదలతో సత్కరించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 24 (పున్నమి ప్రతినిధి)
వెంకటాచలం మండలం చౌటపాళెంలో శ్రీ కోదండరామస్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. భారత 13వ రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కలిసి శ్రీ సీతాలక్ష్మణ హనుమాన్ సమేత శ్రీ కోదండరాముడిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సంప్రదాయ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. వెంకయ్య నాయుడు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కోదండరాముడి కళ్యాణం, పుష్పయాగ మహోత్సవం శోభాయమానంగా సాగింది. పూజా కార్యక్రమాలను తిలకించిన వెంకయ్య నాయుడు, సోమిరెడ్డి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ముప్పవరపు హర్షవర్ధన్, రాధ దంపతులు, దీపా వెంకట్, బీజేపీ, టీడీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *