Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

జనరాజ్ దాస్ సేవలు చిరస్మరణీయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జనరాజ్ దాస్ సేవలు చిరస్మరణీయం

వార్త ముఖ్యాంశాలు

  • మాజీ ఆర్‌ఈసీఎస్‌ చైర్మన్‌ పెంటకోట జనరాజ్ దాస్‌ 67వ జయంతి వేడుకలను మునగపాక మండల కేంద్రంలోని శ్రీ నందీశ్వర ప్రాంగణం, తులసి కళావేదికలో ఘనంగా నిర్వహించారు.
  • ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ పప్పల చలపతిరావుతో పాటు ఏపీఆర్డీసీ చైర్మన్‌, యలమంచిలి టీడీపీ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
  • ఈ సందర్భంగా జనరాజ్ దాస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మాజీ ఆర్‌ఈసీఎస్‌ చైర్మన్‌ పెంటకోట జనరాజ్ దాస్‌ 67వ జయంతి వేడుకలను మునగపాక మండల కేంద్రంలోని శ్రీ నందీశ్వర ప్రాంగణం, తులసి కళావేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ పప్పల చలపతిరావుతో పాటు ఏపీఆర్డీసీ చైర్మన్‌, యలమంచిలి టీడీపీ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జనరాజ్ దాస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజానికి, నియోజకవర్గానికి ఆయన అందించిన సేవలను, ప్రజాక్షేత్రంలో చేసిన కృషిని ప్రగడ నాగేశ్వరరావు స్మరించుకున్నారు. ఆయన ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మునగపాక టీడీపీ మండల అధ్యక్షుడు పెంటకోట విజయ్‌, అచ్చుతాపురం మండల అధ్యక్షుడు పీలా తులసీరామ్‌, రాష్ట్ర గవర్నర్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ భీమరశెట్టి శ్రీనివాసరావు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆడారి మంజు, అచ్చుతాపురం ప్రధాన కార్యదర్శి కాండ్రేగుల అప్పారావుతో పాటు పలువురు స్థానిక నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *