జనగామ, అక్టోబర్ 19,పున్నమి జిల్లా ప్రతినిధి :
సద్దుల బతుకమ్మ పండుగ సందర్బంగా జనగామ పట్టణం బతుకమ్మ కుంట లోని శ్రీ విజయ దుర్గా మాత దేవాలయం లో కిక్కిరిసి న భక్తుల తో నిండిపోయిందని ఆలయ కమిటీ అధ్యక్షులు పిట్టల సత్యం, ఆలయ ప్రధాన పూజారి ఎం ఆర్ ఆరాధ్య తెలిపారు.ఈ సందర్బంగా ఆలయ పూజారి ఆరాధ్య మాట్లాడుతూ అమ్మ వారిని భక్తి శ్రద్ద ల తో మొక్కిన భక్తులకు కోరిన కోర్కెలు తీరుస్తాందని ,ఆలయ కమిటీ అధ్యక్షులు, మరియు సభ్యుల సహాయ సహకారం తో గత పదమూడు సంవత్సరాల నుండి నవరాత్రోత్సవలతో పాటు అనేక భక్తి కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఆలయ అధ్యక్షులు పిట్టల సత్యం మాట్లాడుతూ అందరి సహాయ సహకారం తో ఆలయన్ని అభివృద్ధి చేస్తున్నామని అలాగే గతం కంటే ఇప్పుడు భక్తుల సంఖ్య బాగా పెరిగిందని, అమ్మవారు ప్రతి ఒక్కరికి భక్తులందరికి ఆయురారోగ్యo, సుఖ సంతోషం తో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వంకుడోతు అనిత, జిల్లా సత్యనారాయణ, మేడ శ్రీనివాస్, ఆనంతుల జ్యోతి శ్రీనివాస్, జ్యోతి హైమ, పిట్టల కుమార్, ముప్పిడి మల్లేష్, మడికొండ వెంకటేష్, శేఖర్ భవానీలు తదితరులు పాల్గొన్నారు


