Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చెరుకుముడిలో అనుమానాస్పద మృతి.. పోలీసులపై కుటుంబ సభ్యుల ఆరోపణలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
చెరుకుముడిలో అనుమానాస్పద మృతి.. పోలీసులపై కుటుంబ సభ్యుల ఆరోపణలు

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 15 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం చెరుకుముడి గ్రామానికి చెందిన బొల్లి ఏడుకొండలు (40) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు.
  • బంగారం దొంగతనం కేసులో ఐదు రోజుల క్రితం మనుబోలు పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టడంతోనే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
  • అయితే, గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఏడుకొండలను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 15 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం చెరుకుముడి గ్రామానికి చెందిన బొల్లి ఏడుకొండలు (40) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. బంగారం దొంగతనం కేసులో ఐదు రోజుల క్రితం మనుబోలు పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టడంతోనే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే, గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఏడుకొండలను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేసిన మృతుడి బంధువులు గూడూరు ఏరియా ఆసుపత్రి వద్ద ఆందోళన నిర్వహించి, మృతదేహాన్ని చూపించాలని డిమాండ్ చేస్తూ వైద్యులతో వాగ్వాదానికి దిగారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *