Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

చిట్వేల్ మండలంలో 45 మంది అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు విధుల్లో చేరిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
చిట్వేల్ మండలంలో 45 మంది అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు విధుల్లో చేరిక

వార్త ముఖ్యాంశాలు

  • చిట్వేల్: చిట్వేల్ మండలంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో కొత్తగా నియమితులైన 41 మంది ప్రాథమిక అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు, జడ్.పీ.హెచ్.ఎస్.
  • చిట్వేల్ పాఠశాలలో నలుగురు స్కూల్ అసిస్టెంట్ అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు విధుల్లో చేరారు.ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు ఖాజా మొహిద్దీన్, ఈశ్వరయ్య మాట్లాడుతూ, కొత్తగా విధుల్లో చేరిన అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు వారికి కేటాయించిన ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.
  • పాఠశాలలకు ప్రతిరోజూ సమయపాలనతో హాజరై విద్యార్థుల సమగ్ర విద్యాభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు.

చిట్వేల్: చిట్వేల్ మండలంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో కొత్తగా నియమితులైన 41 మంది ప్రాథమిక అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు, జడ్.పీ.హెచ్.ఎస్. చిట్వేల్ పాఠశాలలో నలుగురు స్కూల్ అసిస్టెంట్ అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు విధుల్లో చేరారు.ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు ఖాజా మొహిద్దీన్, ఈశ్వరయ్య మాట్లాడుతూ, కొత్తగా విధుల్లో చేరిన అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు వారికి కేటాయించిన ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. పాఠశాలలకు ప్రతిరోజూ సమయపాలనతో హాజరై విద్యార్థుల సమగ్ర విద్యాభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు.
సీనియర్ ఉపాధ్యాయులు కామాటం వెంకటేశ్వర్లు, బాలసుబ్రమణ్యం కొత్తగా విధుల్లో చేరిన అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లకు పాఠశాలల్లో నిర్వహించాల్సిన విధులు, బాధ్యతలపై తగిన సూచనలు, సలహాలు అందించారు.
ఎంఈఓలు మాట్లాడుతూ ప్రభుత్వం అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించడం ద్వారా మండలంలోని ఉపాధ్యాయుల కొరత చాలావరకు తీరినట్లయిందన్నారు. కొత్తగా విధుల్లో చేరిన వారు విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అంకితభావంతో పనిచేసి, తాము పనిచేస్తున్న గ్రామాల్లో మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్ గంగాదేవి, క్లస్టర్ రిసోర్స్ ఉపాధ్యాయులు చంద్రశేఖర్, రాజేష్, విజయలక్ష్మి, భవిత, ప్రత్యేక ఉపాధ్యాయులు వెంకటసుబ్బయ్య, అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *