వార్త ముఖ్యాంశాలు
- చిట్వేల్: చిట్వేల్ మండలం తిమ్మాయపాలెం క్రాస్‌రోడ్డు వద్ద వెలసిన శ్రీశ్రీశ్రీ దస్తగిరి నారాయణ తపోవన అభయాంజనేయ స్వామి ఆశ్రమానికి కోడూరుకు చెందిన చామర్తి శోభ, తన కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థంగా బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులు, పండ్లను అందజేశారు.
- స్వయంగా ఆశ్రమానికి విచ్చేసి పీఠాధిపతి నాగేశ్వరమ్మ మాతాజీకి వాటిని అందించారు.
- ఈ సందర్భంగా శోభ మాట్లాడుతూ ఆశ్రమంలోని వృద్ధులకు సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
చిట్వేల్: చిట్వేల్ మండలం తిమ్మాయపాలెం క్రాస్‌రోడ్డు వద్ద వెలసిన శ్రీశ్రీశ్రీ దస్తగిరి నారాయణ తపోవన అభయాంజనేయ స్వామి ఆశ్రమానికి కోడూరుకు చెందిన చామర్తి శోభ, తన కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థంగా బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులు, పండ్లను అందజేశారు. స్వయంగా ఆశ్రమానికి విచ్చేసి పీఠాధిపతి నాగేశ్వరమ్మ మాతాజీకి వాటిని అందించారు.
ఈ సందర్భంగా శోభ మాట్లాడుతూ ఆశ్రమంలోని వృద్ధులకు సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
ఆశ్రమ పీఠాధిపతి నాగేశ్వరమ్మ మాతాజీ దాతలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబ సభ్యుడు పుట్టినరోజులు, పెళ్లిరోజులు, ఇతర శుభకార్యాల సందర్భంగా ఆశ్రమంలోని పెద్దలకు సహాయం అందించాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో పద్మావతమ్మ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.