Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం

వార్త ముఖ్యాంశాలు

  • ఉత్తర అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో సరికొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
  • తర్వాతి 3-4 రోజుల్లో ఇది మరింత బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు దూసుకొస్తుందని అధికారులు తెలిపారు.
  • ఈ క్రమంలో బుధవారానికి ఇది తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తుండటంతో దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ వ్యాప్తంగా గాలుల తీవ్రత పెరిగి మోస్తరు నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

ఉత్తర అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో సరికొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తర్వాతి 3-4 రోజుల్లో ఇది మరింత బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు దూసుకొస్తుందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో బుధవారానికి ఇది తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తుండటంతో దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ వ్యాప్తంగా గాలుల తీవ్రత పెరిగి మోస్తరు నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ప్రజలు, ముఖ్యంగా తీరప్రాంత మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *